అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు..ఓఆర్ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు..ఓఆర్ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అనుకూల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ పరంగా రైల్వే, రవాణా ప్రాజెక్టులను సైతం కేటాయించింది. అయితే ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 14 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలపడం విశేషం.
ఇప్పటికే 140 అడుగులకు రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా కంకిపాడు, తోట్ల వల్లూరు మండలంలోని 10 గ్రామాల్లో 390.12 భూమి సేకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంకిపాడు మండలంలోని మారేడుమాక, కోలవెన్ను, నెప్పల్లి, దావులూరు, చలివేంద్రపాలెం గ్రామాల్లో భూ సేకరణ చేట్టనుంది. అటు తోట్లవల్లూరు మండంలోని బొడ్డపాడు, చినపులిపాక, వల్లూర్ నార్త్, వల్లూరు సౌత్, రొయ్యూరు గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.