ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

The central government appointed new governors for several states along with Andhra Pradesh. దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం.

By అంజి  Published on  12 Feb 2023 5:11 AM GMT
ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు గవర్నర్లను మారుస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో అబ్దుల్‌ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. అయోధ్య రామమందిరం తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల్లో ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఒకరు. జనవరి 4న న్యాయమూర్తి పదవి నుంచి అబ్దుల్‌ నజీర్‌ రిటైరయ్యారు.

కాగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేసిన బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, మణిపూర్ గవర్నర్‌గా అనసూయ, బీహార్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అస్సాం గవర్నర్‌గా గులాబీ చంద్ కటారియా, మేఘాలయ గవర్నర్‌గా చౌహన్, మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్ బైస్, నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా రాధాకృష్ణన్, లడఖ్ లెఫ్టినెంట్ జనరల్‌గా మిశ్రాను కేంద్రం నియమించింది.

అలాగే మహరాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ , లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు రాస్ట్రపతి సెక్రటేరియట్ ప్రకటించింది.

Next Story