ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఇద్దరు పిల్లలను కని పెంచి ప్రయోజకుల్ని చేసిన ఆ మాతృమూర్తి భర్త మరణంతో పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఆదరించటం లేదన్న మనోవేదనతో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరుకు చెందిన ఒక వృద్ధ మహిళ సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న గంగరాజు, బాబు అనే ఇద్ద‌రు కానిస్టేబుళ్లు గమనించి మ‌హిళ‌ను అడ్డుకున్నారు. తాడేపల్లి సీఐ సుబ్రహ్మణ్యం.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హిళ‌ కుటుంబ సభ్యులు వచ్చేవరకూ ఆమె బాగోగులు చూడాల‌ని ఆదేశించారు. సమయస్ఫూర్తితో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు కాపాడిన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


సామ్రాట్

Next Story