సీఎం జ‌గ‌న్‌కు గుడి క‌ట్టిన‌ ఎమ్మెల్యే

Temple for CM Jagan in Andhra Pradesh. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జగన్ కు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి గుడి కట్టించారు.

By Medi Samrat
Published on : 16 Aug 2021 9:59 AM IST

సీఎం జ‌గ‌న్‌కు గుడి క‌ట్టిన‌ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జగన్ కు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి గుడి కట్టించారు. నవరత్నాల నిలయం పేరుతో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయంలో ముఖ్య‌మంత్రి జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు. భారీ ఎత్తున‌ నిర్మించిన ఈ ఆలయంలో దేవుడి ఆల‌యాల‌లోనే ఉండేటువంటి ఓ హుండీ ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు. ఇక‌ ప్రసాదంగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ఈ జగనన్న నవరత్నాల నిలయాన్ని ప్రారంభించారు.


ఇదిలావుంటే.. సీఎం జ‌గ‌న్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పిల్ల‌ల‌కు అందించడం కోసం 'మనబడి నాడు–నేడు' ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు–నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు.



Next Story