టీచర్ మల్లేష్ భార్య చెబుతోందిదే..
సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏపీలో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఓ వైపు ప్రచారం సాగుతూ ఉంది.
By Medi Samrat
సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏపీలో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఓ వైపు ప్రచారం సాగుతూ ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొన్ని కారణాల వలన లక్షలు పొగొట్టుకోవడంతో.. రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఏపీలో సీపీఎస్ రద్దు చేయకపోవడంతోనే టీచర్ మల్లేష్ ఈ పని చేశారని టీడీపీ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మల్లేష్ భార్య శివలక్ష్మి స్పందించారు. కేవలం సీపీఎస్ కారణంగా తన భర్త ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చిందని ఆమె తెలిపిండి. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దని ఆమె కోరారు.