అక్కడి నుండి బ్యాలట్ బాక్స్ లను కర్నూలుకు తరలించండి : టీడీపీ

ఆలూరు, ఆదోని, మంత్రాలయం, యెమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది

By Medi Samrat  Published on  23 May 2024 5:09 AM GMT
అక్కడి నుండి బ్యాలట్ బాక్స్ లను కర్నూలుకు తరలించండి : టీడీపీ

ఆలూరు, ఆదోని, మంత్రాలయం, యెమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఇన్‌చార్జి పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో సరైన భద్రత లేదని.. అందుకే బ్యాలెట్‌ బాక్సులను కర్నూలు నగరంలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించాలన్నారు.

అధికారులు మాత్రం బ్యాలట్ బాక్సులపై ఏ మాత్రం ఆందోళన అవసరం లేదని వివరణ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు సాయుధ సిబ్బంది భద్రత కల్పించారని, వాటిని సురక్షితంగా ఉంచామని తెలిపారు. ప్రత్యర్థి అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుకు అంగీకరించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆయా పార్టీలలో ఓ రకమైన టెన్షన్ మొదలైంది.

Next Story