ఆ ద‌మ్ము మీకుందా.? మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది..

TDP MP Vs YSRCP MP. ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. సీఎంగా జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న ముగించుకుని.. మూడవ‌ ఏట అడుగుపెడుతున్న

By Medi Samrat  Published on  30 May 2021 5:48 AM GMT
ఆ ద‌మ్ము మీకుందా.? మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది..

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. సీఎంగా జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న ముగించుకుని.. మూడవ‌ ఏట అడుగుపెడుతున్న వేళ ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు త‌మ వాయిస్ పెంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌య‌మై ట్విట‌ర్ వేదిక‌గా టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ల మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌రిగింది. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ట్వీట్లు ఝ‌ళిపించారు.

ముందుగా విజ‌య‌సాయి రెడ్డి.. సీఎం జగన్ గారు విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేయిస్తే విమర్శించారు. మరి మహానాడులో స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏది? ఓ పోరాట యోధునిలా ఉగిపోయావుగా. తీర్మానం చేయడానికి ప్యాంట్లు తడిసిపోతే ఎలా? నువ్వా ఢిల్లీలో పోరాడేది. నిన్ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లేన‌ని టీడీపీ అధినేత‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

విజ‌య‌సాయి ట్వీటుకు రామ్మోహ‌న్ నాయుడు.. ఢిల్లీ మెడలు వంచుతా అని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసు. పార్లమెంట్‌లో 28 ఎంపీలు ఉన్నా.. ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా, ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదు అంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారు. 28 ఎంపీలు ఉన్నారుగా.. వచ్చే పార్లమెంట్ సెషన్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది అంటూ ఘాటుగా బ‌దులిచ్చారు.



Next Story