వైసీపీ ఎమ్మెల్యేను పొగిడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

TDP MP Keshineni Nani praised the YCP MLA. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ను టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశం అయింది.

By Medi Samrat  Published on  22 May 2023 3:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేను పొగిడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ను టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మంచిపని చేసే వాళ్లను తాను అభినందిస్తానని చెప్పారు. మొండితోక జగన్మోహన్ తనకు నాలుగేళ్లుగా తెలుసని, మొండితోక బ్రదర్స్ మంచి వ్యక్తులని ప్రశంసించారు. అంతేకాకుండా మైనింగ్, ఇసుకలో వాటాలు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తిని తాను కాదని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎవరు మంచి చేసినా తాను ప్రశంసిస్తానని, తెలంగాణ కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడుతానని గతంలో కేసీఆర్ చెప్పారని.. విజయవాడ అభివృద్ధి కోసం తాను ముళ్లపందితోనైనా కలుస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్ లో కూర్చొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఎంపీ పదవి ఉన్నా, లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు.

రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు. ఎంపీగా ఉన్న నేను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలి. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయ భాను, మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నానని అన్నారు.


Next Story