భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదంతో కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను ప్రభుత్వం వేదించటo సరికాదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆనందయ్య మందుపై ఎందుకు వాస్తవాలు దాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆనందయ్య ఆయుర్వేద మందు వేలాది మంది కరోనా రోగులకు సంజీవనిగా నిలిచి ప్రాణాలు కాపాడుతోందని.. అటువంటి మందు పంపిణీని వారం రోజులుగా ఎందుకు ఆపేశారని ప్ర‌శ్నించారు.

ఇప్పటికే 70 వేల మందికి పైగా మందు తీసుకుంటే ఏ ఒక్కరైనా తమకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని.. అనుమతులు ఇవ్వడానికి మొదట రెండు రోజులన్నారు.. తర్వాత నాలుగురోజులున్నారు.. ఇప్పుడు వారమంటున్నారు. ఎవరికోసం వాయిదాలు వేస్తున్నారని ప్ర‌శ్నించారు.

వైసీపీ నేతలు ఆనంద‌య్య మందు విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని.. అవినీతివేదoలో సిద్ధహస్తుడైన చెవిరెడ్డికి ఆయుర్వేదంతో ఏం సoబందం? దీనిలో ఆయన జోక్యం ఏంటి? అని ప్ర‌శ్నించారు. ఆనందయ్య మందుతో వైసీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. వైసీపీ ఎంపీలు మందును ఇతర రాష్ట్రల్లో తమ బంధువులకు, తెలిసిన వారికి పంపిస్తున్నారని మీడియాలో క‌థ‌నాలు వచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్ర‌శ్నించారు.

ప్రజలకు ఉపయోగపడాల్సిన ఆనందయ్య మందును వైసీపి నేతలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని పోలీసులతో నిర్బందానికి గురిచేయడం ఎంత వరకు సమంజసం? తెల్లవారుజామున అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచాల్సిన అవసరం ఏంటి? ఆనందయ్యకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి. ఆనందయ్య మందు దేశ ప్రజలoదరికీ అందుబాటులోకి వస్తే మన రాష్ట్రానికే మంచి పేరొస్తుంది. త్వరగా దీనిపై అధ్యయనం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనగాని సత్యప్రసాద్ అన్నారు.


సామ్రాట్

Next Story