సీఎం జగన్‌ది కక్ష సాధింపు.. 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని.. బాలయ్య హాట్‌ కామెంట్స్‌

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

By అంజి  Published on  9 Sep 2023 1:11 PM GMT
TDP, Balakrishna, Chandrababu, arrest, APnews

సీఎం జగన్‌ది కక్ష్య సాధింపు.. 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని.. బాలయ్య హాట్‌ కామెంట్స్‌

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని బాలయ్య ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదన్నారు.

డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని బాలయ్య నిలదీశారు. మళ్లీ తప్పుల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని అన్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ అన్నారు.

Next Story