ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం చెప్పలేని దుస్థితి : అచ్చెన్నాయుడు

TDP MLA Acham Naidu criticizes CM Jagan. ఆగస్ట్ 1 నుంచి 10వరకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ల‌నున్నార‌ని

By Medi Samrat  Published on  29 July 2023 10:00 AM GMT
ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం చెప్పలేని దుస్థితి : అచ్చెన్నాయుడు

ఆగస్ట్ 1 నుంచి 10వరకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ల‌నున్నార‌ని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సాగునీటి, వ్యవసాయరంగాల్ని భ్రష్టుపట్టించిన జగన్ చేతగానితనం, అసమర్థతను ఆధారాలతో సహా చంద్రబాబు ప్రజలముందు ఉంచనున్నార‌ని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిని చంద్రబాబు కళ్లకుకట్టినట్టు ఆధారాలతో సహా మీడియాసాక్షిగా ప్రజలకు చెప్పారు. మేం చెప్పినవాటిపై స్పందించకుండా బుద్ధిలేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే రాంబాబుకి ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. సొంత నియోజకవర్గంలోని కాలువల్లో పూడిక, తూటుకాడ తొలగించలేని రాంబాబు, ప్రాజెక్టుల గురించి చెబుతుంటే, ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.

దోపిడీ, ఎదురుదాడి, హత్యరాజకీయాలు తప్ప జగన్ కు అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదని.. అతని నాలుగేళ్ల పాలనతో ప్రజలకు అర్థమైందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన సాగునీటి, వ్యవసాయరంగాల్ని చేతగానితనం, అసమర్థతతో జగన్ భ్రష్టు పట్టించాడని విమ‌ర్శించారు. ఆయా రంగాల్లో జగన్ వైఫల్యాలను ఎత్తిచూపడానికే ఆగస్ట్ 1 నుంచి 10 వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారని కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

అవినీతి, అధికారమత్తులో ఏపీ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన జగన్ రెడ్డి ప్రధానరంగాలైన సాగునీటి, వ్యవసాయరంగాల్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడని విమ‌ర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు కాడి వదిలేసి, పంటల విరామమే నయమని, ఎందుకు వ్యవసాయం చేయాలనే స్థితికి వచ్చేలా చేశాడని ఆరోపించారు.

వ్యవసాయం బాగుకి సాగునీటి రంగమే కీలకమనే ఇంగితం జగన్ కు లేకపోవడం బాధాకరం అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి, 60 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తైన అనేక ప్రాజెక్టుల్ని అటకెక్కించాడని ఆరోపించారు. 69 నదులు రాష్ట్రంలో ఉండటం నిజం గా ప్రజలకు, రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి లాంటి ప్రధాన నదులుండి రాష్ట్రంలో ఎందుకు సాగు పెరగడం లేదనే ఆలోచన జగన్ చేయకపోవడం నిజంగా రైతుల దౌర్భాగ్యమనే చెప్పాలి. టీడీపీ, ఇతరపార్టీలు, ప్రజలు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం చెప్పలేని దుస్థితి జగన్ ది అని అచ్చెన్నాయుడు అన్నారు.


Next Story