వారు లేకుండానే టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం

TDP Leaders pays tribute to Nandamuri Taraka Rama Rao on his 26th death anniversary. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి.

By Medi Samrat  Published on  18 Jan 2022 1:45 PM GMT
వారు లేకుండానే టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కరోనా బారినపడడంతో ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ ఐసోలేషన్ లో ఉన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్ ల ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రజల ఆశీస్సులతో వారు కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నారా లోకేశ్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని లోకేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. కరోనా నుంచి కోలుకునేంత వరకు ఐసోలేషన్ లో ఉంటానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు.


Next Story
Share it