కేంద్ర జలశ‌క్తి శాఖ మంత్రితో టీడీపీ నేతల భేటీ

TDP Leaders Meet With Union Minister Gajendra Singh Shekhawat. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం

By Medi Samrat
Published on : 31 Aug 2021 2:42 PM IST

కేంద్ర జలశ‌క్తి శాఖ మంత్రితో టీడీపీ నేతల భేటీ

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నాయకుల బృందం మంగ‌ళ‌వారం కలిసింది. వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై టీడీపీ బృందం కేంద్ర మంత్రిని కలిసింది. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని టీడీపీ బృందం కేంద్ర మంత్రిని కోరింది. ఈ భేటీలో ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను టీడీపీ బృందం కేంద్రమంత్రికి వివరించింది. ఢిల్లీకి వెళ్లిన నేతల బృందంలో ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావుతో పాటు జనార్థన్‌, ఉగ్రనరసింహారెడ్డి ఉన్నారు.


Next Story