మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి క‌న్నుమాత‌

TDP Leader Sridhar Krishna Reddy Passed Away. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో

By Medi Samrat
Published on : 31 Jan 2022 9:31 PM IST

మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి క‌న్నుమాత‌

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. 2014లో ప్రజారాజ్యం పార్టీ తరుపున నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ నెల్లూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మంగళవారం శ్రీధర్ కృష్ణారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. శ్రీధర్‌కృష్ణారెడ్డి మృతి టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని టీడీపీ నేత బీద రవిచంద్ర అన్నారు. ప్రజలు, కార్యకర్తల కోసం ఆయన అలు పెరగక శ్రమించారన్నారు.

శ్రీధర్ కృష్ణారెడ్డి గతంలో నెల్లూరు జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ, నెల్లూరు సిటీ తెలుగు యువత ప్రెసిడెంట్ గానూ వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై శ్రీధర కృష్ణారెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో విజయం దక్కించుకున్నారు. శ్రీధర కృష్ణారెడ్డి మృతిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.



Next Story