ఆయన్ను గెలిపించండి.. ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఈ ఎన్నిక‌లు సదావకాశం

TDP Leader Nandamuri Balakrishna. వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో

By Medi Samrat  Published on  21 Oct 2022 3:00 PM GMT
ఆయన్ను గెలిపించండి.. ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఈ ఎన్నిక‌లు సదావకాశం

వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఆయన్ను గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం నాయకుడిగా చాలా అనుభవం కలిగిన ఆయనను ఉమ్మడి కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు, నందమూరి అభిమానులు, టీడీపీ కుటుంబసభ్యులు గెలిపించుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సదవకాశం అన్నారు.

రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రకటించాయి. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. 2023 మార్చికి ఈయన పదవీకాలం ముగుస్తుంది.



Next Story