రూ.20 నోట్లను పంచిన టీడీపీ నేత

TDP leader distributes Rs 20 Notes And buttermilk packets. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభిన్న

By Medi Samrat
Published on : 16 April 2022 8:06 PM IST

రూ.20 నోట్లను పంచిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభిన్న త‌ర‌హా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో శనివారం ఏలూరు హైవే రోడ్డులో టీడీపీ సీనియర్‌ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిరసన తెలిపారు. అయితే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు చింతమనేని ప్రభాకర్‌ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. నిరసనలో భాగంగా, ప్రభుత్వం విధించిన భారాన్ని ప్రజలు భరించలేకపోతున్నారని పేర్కొంటూ.. ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులకు చింతమనేని ప్రభాకర్‌ రూ.20 నోట్లను పంపిణీ చేశారు. వేసవి కారణంగా ఎండవేడిమికి తాళలేక ఉన్న‌ ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు.







Next Story