జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి : బుద్దా వెంకన్న
జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.
By Medi Samrat Published on 24 July 2024 11:29 AM GMTజగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడ వన్ టౌన్ లో కాళీకాదేవి, చంద్రబాబు ఫ్లెక్స్ లతో బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది. టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. అ అబద్దం, ఆ అవినితి.. అంటే జగన్ కు బాగా ఇష్టమని సెటైర్లు సంధించారు. ఇప్పుడు అబద్దాలతో డిల్లీలో మాయ ధర్నా చేస్తున్నాడని విమర్శించారు. పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడని.. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ నాలుగు వేలు చేశారన్నారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు.
తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. 2004, 2009లలో జగబ్ ఎన్నికల అఫిడవిట్ పరిశీలీంచాలి.. 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 42 వేల కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసిందన్నారు. ఈ ఐదేళ్లల్లో మద్యం, మైనింగ్, ఇసుక మాఫీయాలతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడని అన్నారు. ఈ ఐదేళ్లల్లో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆ దుర్గమ్మ వద్దకు ఊరేగింపుగా వచ్చి ఆ తల్లిని కోరాం.. జగన్ అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని వేడుకున్నామని తెలిపారు. చంద్రబాబు వచ్చాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారు. జగన్ పాలనలొ ప్రజలు భయంతో బతికారని అన్నారు.
మొన్న రషీద్ హత్య కూడా ఇద్దరు వైసీపీ కార్యకర్త ల మధ్య గొడవ అన్నారు. రాజకీయ హత్యగా జగన్ ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఢిల్లీ వెళ్లి హడావుడి చేసినా నీ మోసాలను ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారన్నారు. మా వారిని కూడా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గించ వద్దని చెప్పిన నాయకుడు చంద్రబాబు అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలన్నారు. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. వెంటనే విచారణ చేసి జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.