దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి అరకు వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది.

By Medi Samrat  Published on  20 Jan 2024 5:45 PM IST
దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్..!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి అరకు వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్లో వెళుతోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలెట్ కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా పేరిట వివిధ జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నం నుంచి అరకు హెలీకాప్టర్‌లో బయలుదేరారు. విశాఖ నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే ఆ ఛాపర్ దారి తప్పింది. రాంగ్ రూట్‌లో వెళ్తోందని తెలిసిన ఏటీసీ హెచ్చరించింది. వెనక్కి వచ్చేయాల్సిందిగా ఏటీసీ సూచించడంతో క్షేమంగా హెలీకాప్టర్ విశాఖకు వచ్చేసింది. ఆ తరువాత కాస్సేపటికి అరకు వెళ్లేందుకు సిగ్నల్ లభించడంతో తిరిగి బయలుదేరారు. అరకులో చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్టు అధికారులు వెల్లడించారు.

Next Story