తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న జెండా సభలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. చేయి చేయి కలిపి పైకెత్తి టీడీపీ, జనసేన ఐక్యతను చాటారు. పరస్పరం జెండాలు మార్చుకున్నారు. చంద్రబాబు జనసేన జెండా చేతబట్టగా, పవన్ కళ్యాణ్ టీడీపీ జెండా అందుకుని ఊపారు. సభా వేదికపై పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన నేతలతో చంద్రబాబు, పవన్ కరచాలనం చేశారు.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు సభకు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీడీపీ-జనసేన కూటమి తరఫున తొలి జాబితను విడుద చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో సభ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయమై కొన్ని అనుమానాలు వచ్చాయి. అయితే భారీగానే ఇరు పార్టీల కార్యకర్తలు సభా ప్రాంగణానికి తరలివచ్చారు.