న్యాయానికి సంకెళ్లు అంటున్న నారా లోకేష్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు

By Medi Samrat  Published on  14 Oct 2023 5:31 PM IST
న్యాయానికి సంకెళ్లు అంటున్న నారా లోకేష్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా ‘‘న్యాయానికి సంకెళ్లు’’ పేరిట తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ " చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన #PichiJagan నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15వ తేదీ) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకొని నిరసన తెలియజేయండి. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు గారి ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవండి." అంటూ ట్వీట్ చేశారు.

Next Story