నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్సీ అభ్యర్థులు

By Medi Samrat  Published on  2 July 2024 3:38 PM IST
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జ‌న‌సేన ఎమ్మెల్సీ అభ్యర్థులు

శాసన సభ్యుల కోటాలో శాసనమండలిలో ఏర్పడిన రెండు ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసన సభ కమిటీ హాల్ లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పిడుగు హరి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరఫున సి. రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం. విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు.

ఈ కార్య‌క్ర‌మానికి జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధ ప్రసాద్; తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్. ఎం. డి. ఫరూఖ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, యేలూరి సాంబశివరావు హాజరయ్యారు.

Next Story