సీఎం జగన్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రతినిధులు భేటీ

Tata Advanced Systems representatives meets YS Jagan over investment opportunities in state. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు

By Medi Samrat
Published on : 30 Aug 2022 6:13 PM IST

సీఎం జగన్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రతినిధులు భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. రక్షణ విమానయాన రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో భేటీ అయిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ రెగ్యులేటరీ హెడ్ జె. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికల్‌ వలవెన్‌, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.




Next Story