అమరావతి రైతుల యాత్రలో కనిపించిన ఆ హీరో

Tarakaratna participated in Amaravati Farmers' Yatra. అమరావతి టూ అరసవల్లి రైతుల మహా పాదయాత్ర 38వ రోజు బుధవారం కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  19 Oct 2022 6:07 PM IST
అమరావతి రైతుల యాత్రలో కనిపించిన ఆ హీరో

అమరావతి టూ అరసవల్లి రైతుల మహా పాదయాత్ర 38వ రోజు బుధవారం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. హుకుంపేట, పిడింగొయ్య, రాజవోలు గ్రామాల మీదుగా కేశవరం వరకు కొనసాగుతుంది. రాజమహేంద్రవరం రూరల్‌లో 38రోజు ప్రారంభమైన రైతుల మహాపాదయాత్రకు స్థానిక నాయకులు తరలివచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చినరాజప్పతో పాటూ పలు పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్రలో నందమూరి హీరో కూడా కనిపించడం విశేషం. నందమూరి హీరో తారకరత్న రాజమహేంద్రవరం రూరల్‌లో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రైతులతో కలిసి కొంతదూరం పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు తారకరత్న.


Next Story