ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఎమ్మెల్యేకు పాజిటివ్‌..!

Tanuku Mla Tests Corona Positive. ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి

By Medi Samrat
Published on : 2 Dec 2020 9:40 AM

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఎమ్మెల్యేకు పాజిటివ్‌..!

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది. రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుమురి హాజరు అయ్యారు. దాంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరావు ప్రసంగించారు. కోవిడ్ రావడంతో అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం అయ్యారు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకీ గైర్హజరు అయ్యారు.

తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. ఇందులో 8,54,326 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,427 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 6,996 మంది ప్రాణాలు కోల్పోయారు.




Next Story