రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే.. ఎస్వీ ప్రసాద్ మరణ వార్త మనసులను పిండి వేస్తున్న సమయంలోనే.. మరో దారుణ వార్త విన‌వ‌ల‌సివ‌చ్చింది. కరోనాతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరిన ప్రసాద్ భార్య కూడా కొద్దిగంటల తేడాతో మరణించారు. చావులో సైతం వారు కలిసే ప్రయాణించడం వారి జీవితంలోని మరో విషాద ఘట్టమంటూ ఈ వార్త తెలిసిన ప‌లువురు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఎస్వీ ప్రసాద్‌.. 1975 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్‌, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా పనిచేశారు.


సామ్రాట్

Next Story