టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసింది. జస్టిస్ భట్టి.. చంద్రబాబు పిటిషన్ ను విచారించలేనని స్పష్టం చేయడంతో.. సీజేఐ బెంచ్ ఆ పిటిషన్ ను స్వీకరిస్తుందేమోనని చంద్రబాబు న్యాయవాదులు ఆశించారు. ఇక సెలవుల అనంతరం, చంద్రబాబు పిటిషన్ ను విచారించే ధర్మాసనాన్ని ఖరారు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. 6వ నెంబరు కోర్టులో ఈ విచారణ జరగనుంది.
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి తనపై నమోదయిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 3న సుప్రీం కోర్టు నుండి ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతూ ఉన్నారు.