విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం అన్నారు.
పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని.. మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమేనని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలపై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ఏపీలో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం అన్నారు.