అభిమాన నేతకు విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు

తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 6:34 PM IST
అభిమాన నేతకు విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు

తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన బాబుగారి రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.




Next Story