తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తూ సంచరిస్తున్న వింత జంతువు ఎట్టకేలకు చిక్కింది. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ నూతిలో వింత జంతువును గుర్తించారు. ఈ రోజు తెల్లవారు జామున ఈ వింత జంతువును రైతులు గుర్తించారు. అయితే.. దాని వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. బావిలో నుండి పైకి చూస్తూ… జనాల్ని చూసి లోపలికి వెళ్లిపోతోందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. వెంటనే రైతులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ జంతువును బావి నుంచి వెలికి తీస్తే తప్ప జనాన్ని భయపెడుతున్న ఆ జంతువు ఏంటనే మిస్టరీ వీడేలా కనిపించడం లేదు.