ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం జ‌గ‌న్‌పై దాడి.. క‌నుబొమ్మ‌పై గాయం

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి రాళ్లతో దాడి చేశారు

By Medi Samrat  Published on  13 April 2024 9:45 PM IST
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం జ‌గ‌న్‌పై దాడి.. క‌నుబొమ్మ‌పై గాయం

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేప‌థ్యంలో.. ప్రచారంలో భాగంగా ఆయన ప్రారంభించిన 21 రోజుల మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 14వ రోజుకు చేరుకోగా.. ఈరోజు యాత్ర విజయవాడలోకి ప్రవేశించింది.

న‌గ‌రంలోని సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌ సెంటర్‌ సమీపంలో యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ త‌ల‌కు రాయి తగలడంతో ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే నిల్చున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా గాయమైంది. వెంటనే వైద్యులు అతడికి బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన బస్సుయాత్ర కొనసాగించారు. జగన్ పై టీడీపీ వారే దాడి చేశారని విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు అనుమానిస్తున్నారు.

Next Story