ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లొ కిలో గోధుమ పిండిని కేవలం రూ.20 కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మొదట జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే డిమాండ్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా సరఫరా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల్ని కచ్చితంగా ఇచ్చేలా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు ఈ సరుకులు చేరుకున్నాయి. కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా ఈ రేషన్ సరుకుల్ని పంపిణీ చేస్తారు. అందువల్ల ప్రజలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.