రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

By -  Knakam Karthik
Published on : 8 Oct 2025 3:55 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, 11th SIPB meeting, investments

రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

అమరావతి: 11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా..వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ SIPB ఆమోదం తెలిపింది. దీంతో రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న RAIDEN INFO TECH DATA CENTERకు ఆమోదం తెలిపింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో FDI రాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందన్న SIPB సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాగతా అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి, మంత్రుల అభినందనలు తెలియజేశారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న ముఖ్యమంత్రి..3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన SIPB సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చించారు. ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 SIPBల ద్వారా రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపగా..6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.


Next Story