అమరావతి: రేపు సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. కాగా మంగళవారం సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. మరో వైపు రాజధాని గ్రామాల్లో అనాథలైన పిల్లలకు కూడా రూ.5 వేల పెన్షన్ ఇచ్చే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
ఇక కృష్ణా నది తీరంలో మెరినా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపు, ఎస్‌ఐపీబీలో ఆమోదించిన పలు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. చివరగా పలు శాఖలకు చెందిన అజెండాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.