భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. 25న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత‌

Srisailam Mallanna temple closure on 25th. ఈనెల 25న సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు

By Medi Samrat
Published on : 12 Oct 2022 8:00 PM IST

భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. 25న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత‌

ఈనెల 25న సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని ఆలయ ఈవో తెలిపారు. గ్రహణం కారణంగా ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాత్రి 8 గంటల తరువాత మల్లన్న సర్వదర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్ 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సూర్య, చంద్రగ్రహణం వల్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడుతున్నందని.. ఉదయం 8.11గంటల నుంచి రాత్రి 7.30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నవంబర్ 8 వ తేదీని చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు కూడా ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయశుద్ధి నిర్వహించి ఆలయాన్ని తెరవనున్నారు. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా ఈ రెండు రోజుల్లో అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతి ఉంది.


Next Story