శ్రీహరికోట షార్‌లో కరోనా విజృంభణ.. అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం.!

Sriharikota faces COVID-19 scare. భారత అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న.. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

By అంజి  Published on  19 Jan 2022 8:10 AM GMT
శ్రీహరికోట షార్‌లో కరోనా విజృంభణ.. అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం.!

భారత అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న.. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన రెండ్రోజుల్లో షార్‌లో 200పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం నాడు 142 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. నేడు మరో 91 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని సంబంధిత అధికారులు తెలిపారు. షార్‌లో సంక్రాంతి పండుగకు సెలవులపై ఇంటిక వెళ్లి వస్తున్న వారికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో చాలా మందికి పాజిటివ్‌గా తేలుతోంది. మరోవైపు షార్‌లో 50 శాతం హాజరుతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతరిక్ష ప్రయోగాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 38,055 పరీక్షలు నిర్వహించగా.. 6,996 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,7384కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514గా ఉంది. 24 గంటల వ్యవధిలో 1,066 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,66,762కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,19,22,969 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story