18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు.. 20న సీఎం చేతుల మీదుగా బహుమతులు

శాసనసభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ చాంబర్‌లో స‌భాప‌తి అయ్యన్నపాత్రుడుతో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు.

By Medi Samrat
Published on : 5 March 2025 3:45 PM IST

18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు.. 20న సీఎం చేతుల మీదుగా బహుమతులు

శాసనసభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ చాంబర్‌లో స‌భాప‌తి అయ్యన్నపాత్రుడుతో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో శాసనసభ్యుల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు.

పురుష ఎమ్మెల్యేల కోసం క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు, మహిళా ఎమ్మెల్యేల కోసం బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం వంటి క్రీడలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే, పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

మార్చి 20న సీఎం చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాలని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రోత్సాహంగా పాల్గొనాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు కోరారు. ఈ కార్యక్రమాల ముగింపు సందర్భంగా మార్చి 20న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విప్ గణబాబు, ఎమ్మెల్యేలు కె ఎస్ ఎన్ ఎస్ రాజు, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story