ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలోని నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్పీకర్ కాన్వాయ్ వాహనం కాల్వలోకి దూసుకెళ్ళింది. తమ్మినేనితో పాటు అందరూ సురక్షితంగా ఉన్నారు. గాయపడిన వారిని స్పీకర్ దగ్గరుండి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలింపజేశారు. ఆయన వేరే వాహనంలో తన ఇంటికి వెళ్ళిపోయారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జ‌రిగింది.సామ్రాట్

Next Story