జిల్లా వ్యాప్తంగా ఎన్ని లైసెన్సు గన్నులు ఉన్నాయి : వివ‌రాలు కోరిన ఎస్పీ

SP Vishal Gunni About Licensed Weapons. గన్స్ లైసెన్స్ విషయంలో తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి బుధ‌వారం గుంటూరు

By Medi Samrat  Published on  1 Sept 2021 5:27 PM IST
జిల్లా వ్యాప్తంగా ఎన్ని లైసెన్సు గన్నులు ఉన్నాయి : వివ‌రాలు కోరిన ఎస్పీ

గన్స్ లైసెన్స్ విషయంలో తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి బుధ‌వారం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులు, బ్యాంకుల భద్రతా సిబ్బంది, వివిధ రకాల భద్రతా సంస్థల ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాల లైసెన్స్ లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని లైసెన్సు కలిగిన గన్నులు ఉన్నాయి.. వాటిలో మాజీ సైనికోద్యోగుల వద్ద ఎన్ని ఉన్నాయి అని అరా తీయాలని చెప్పారు.

గడచిన కొద్దీ రోజులుగా మాజీ సైనికోద్యోగులు ఎవరిమీద అయినా కేసులు నమోదు అయ్యాయా అని ఆరాతీయాల‌ని సూచించారు. గన్నులకు లైసెన్సు ఎప్పుడు.. ఎక్కడి నుండి తీసుకున్నారు. ఆ లైసెన్సులను ఎప్పుడు పునరుద్ధరించారో వివ‌రాలు మొత్తం పరిశీలించాలని ఆదేశించారు. గడచిన సంవత్సర కాలంలో.. కాల పరిమితి ముగిసినప్పటికి ఇంకా లైసెన్సు పునరుద్ధరించని వారు ఎందరు వున్నారు.. వారిలో ఎంతమంది సాధారణ ప్రజలు ఉన్నారో తెలుసుకోవాలని అధికారుల‌ను కోరారు. కార్య‌క్ర‌మంలో ఇటీవ‌ల‌ మాచర్లలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గన్నును ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు.


Next Story