హెల్త్‌కేర్, సోషల్ వెల్ఫేర్‌కు చేసిన కృషికి దేశవ్యాప్తంగా నటుడు సోనూ సూద్ కు మంచి పేరు ఉంది. ఆయన స్థాపించిన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య సేవలను బలోపేతం చేయడానికి నాలుగు అంబులెన్స్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందించింది.
సోనూ సూద్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు తెలిపారు.