గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి..

మార్చి 17, 2024న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు.

By Medi Samrat  Published on  18 March 2024 1:42 PM GMT
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి..

మార్చి 17, 2024న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. ఆ అభ్యర్థిని శివశంకర్‌గా గుర్తించారు. పల్నాడు జిల్లాకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుమారుడని విచారణలో తేలింది. శివశంకర్ తన ఐఫోన్‌ను ఉపయోగించి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఈ పనిని చూసిన మరొక అభ్యర్థి ఇన్విజిలేటర్‌ను ఆశ్రయించాడు.

జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శివశంకర్‌ను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపి పోలీసులకు అప్పగించారు. శివ శంకర్ తన ఐఫోన్ పాస్‌వర్డ్‌ను వెల్లడించడానికి నిరాకరించాడు. IT బృందం ప్రయత్నించినప్పటికీ.. సమాచారాన్ని యాక్సెస్ చేయడం సాధ్యం కాలేదు. భద్రతా తనిఖీలు, మెటల్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అతను ఐఫోన్‌ను ఎలా పరీక్షా హాల్ లోకి తీసుకుని వెళ్ళాడో తెలియదు. శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం కిషోర్ బాబు తెలిపారు.

Next Story