సీఎం జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ
Somu Veerraju Letter To CM Jagan. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
By Medi Samrat Published on
26 Aug 2021 1:30 PM GMT

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, వ్యవహారాలు రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెడుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. తేరుకోలేనంతగా అప్పుల ఊబిలోకి రాష్ట్రం కూరుకుపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీ వైసీపీ సర్కారు.. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళుతోంది ? ఆర్థికంగా ఏ పాతాళాలు చేర్చాలని ఉవ్విళ్లూరుతోం దంటూ ఘాటు విమర్శలు చేశారు. దేశంలోనే అతిపెద్ద సముద్ర తీరం ఉన్న, అపరిమితమైన ఆర్థిక వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ఆర్థిక బలోపేతం చేయకుండా నిర్లక్ష్యంగా పాలన చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.
Next Story