కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇటీవల నందమూరి తారకరామారావును కలిసినప్పటి నుండి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు భారీగా వైరల్ అవుతూ ఉన్నాయి. రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి అమిత్ షా ఏ అవకాశాన్ని వదులుకోరని.. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారని పలువురు నాయకులు చెప్పుకొచ్చారు.
తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జూ. ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు. జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఆయనకు ప్రజాదరణ ఎక్కడుంటే ఆయన సేవలు అక్కడే ఉపయోగించుకుంటాము. ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పిందని అన్నారు. టీడీపీ తిరిగి పుంజుకోవాలంటే ఎన్టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని ఓ వైపు రాజకీయ నిపుణులు చెబుతూ ఉంటే.. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని చెబుతుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.