వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది.. నైతిక విజయం బీజేపీదే

Somu Veerraju Comments On Badvel ByPoll Result. బద్వేలు ఉప ఎన్నిక‌లో ప్రజలు బీజేపీని ఆదరించార‌ని.. నైతిక విజయం బీజేపీదేన‌ని

By Medi Samrat  Published on  2 Nov 2021 12:37 PM GMT
వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది.. నైతిక విజయం బీజేపీదే

బద్వేలు ఉప ఎన్నిక‌లో ప్రజలు బీజేపీని ఆదరించార‌ని.. నైతిక విజయం బీజేపీదేన‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. మేం ఏం చేసామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగామ‌ని.. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు ఆడిగిందని విమ‌ర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా పోలింగ్ జరగాలని కోరామ‌ని.. వైసీపీ బయటవారిని తీసుకుని వచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. అయిదుగురు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారని.. మాకు అభ్యర్థి ప్రధానంగా ప్రచారం చేశామ‌ని ఆయ‌న అన్నారు. కులాలు వారిగా వైసీపీ సమావేశాలు నిర్వహించి నయానా, భయానా లొంగదీసుకునే ప్రయత్నం చేసింద‌ని ఆరోపించారు.

మేం అభివృద్ధిపై చర్చకు.. రమ్మంటే వైసీపీ ముఖం చాటేసిందని.. మేం ధర్మయుద్ధం చేశామ‌ని.. వైసీపీ అధర్మయుద్దం చేసిందని విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండున్నర సంవత్సరాలకే వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వ‌చ్చిన‌ట్లు కొట్టచ్చినట్లు బద్వేలు ఎన్నికల ఫలితాలు వల్ల అర్థం అవుతోందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 40వేల ఓట్లు రిగ్గింగ్ చేశారని.. నోటుతో ఓట్లు కొనుగోలు చేశారని.. అయినప్పటికీ గత ఎన్నికల కంటే ఇప్పుడు 10శాతం పోలింగ్ తగ్గిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణం అని అన్నారు. బీజేపీకి సాధారణ ఎన్నికల కంటే 300 శాతం ఓటింగ్ పెరిగిందని సోమువీర్రాజు అన్నారు.


Next Story