వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్ప‌కూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer dies of a heart attack in Punganuru while exercising. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ యువకుడు వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో

By Medi Samrat
Published on : 3 July 2022 5:27 PM IST

వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్ప‌కూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ యువకుడు వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన దురదృష్టకర ఘటన జ‌రిగింది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు పట్టణానికి చెందిన మాజీ సైనికోద్యోగి సుధాకర్ రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.తేజవిష్ణువర్ధన్ రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.

మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్యతో తేజ‌కు వివాహమైంది. గత వారం ఆషాడ మాసం కావడంతో లావణ్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తేజవిష్ణువర్ధన్ రెడ్డికి రోజూ ఉదయం వ్యాయామం చేయడం అలవాటు. శనివారం ఉదయం సైక్లింగ్ చేస్తుండ‌గా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

గమనించిన తండ్రి సుధాకర్ రెడ్డి వెంటనే డాక్టర్ కు సమాచారం అందించారు. వచ్చి పరిశీలించిన డాక్ట‌ర్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడ మాసం పూర్తి చేసుకున్న వెంట‌నే కొత్త జంట తిరుమలను దర్శించుకుని హనీమూన్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇంతలో ఈ విషాద ఘటన అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది.












Next Story