ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయ‌డంలో ఆర్‌టీఏ జాప్యం.. మండిప‌డుతున్న వాహ‌న‌దారులు

Smart Card Shortage Motorists Fume as RTA Delays Issuing DLS in Andhra. స్మార్ట్ కార్డుల కొరత కారణంగా రోడ్డు రవాణా అథారిటీ (ఆర్‌టీఏ) పత్రాలను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2022 11:50 AM GMT
ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయ‌డంలో ఆర్‌టీఏ జాప్యం.. మండిప‌డుతున్న వాహ‌న‌దారులు

స్మార్ట్ కార్డుల కొరత కారణంగా రోడ్డు రవాణా అథారిటీ (ఆర్‌టీఏ) పత్రాలను జారీ చేయలేకపోవటంతో వందలాది మంది వాహన యజమానులు డ్రైవింగ్ లైసెన్సులు (డీఎల్‌లు), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్‌సీలు) దొరకకుండా ఉన్నారు. కొత్త కాంట్రాక్టర్‌కు టెండర్‌ ఇవ్వడంలో జాప్యం జరగడమే ఈ కొరతకు కారణమైంది. ప్రస్తుతం కార్డుల కొరత ఉందని వైజాగ్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ జిసి రాజరత్నం తెలిపారు. "రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్స్ లను ఆర్‌టి వైజాగ్ జారీ చేస్తుంది. కొత్త స్మార్ట్ కార్డుల సరఫరాకు కొంత సమయం పట్టవచ్చు," అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ఆర్‌టీఏలు నెలలో లక్ష కార్డులు (డీఎల్‌లు, ఆర్‌సీలు) జారీ చేస్తున్నాయని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు నెలలుగా ముద్రణకు సంబంధించిన కార్డుల కొరతను ఎదుర్కొంటున్నారు. కొత్త స్మార్ట్ కార్డుల సరఫరాకు ఒకటి లేదా రెండు నెలలు పట్టవచ్చు. చాలా మంది వాహనదారులు తమ డిఎల్‌లు లేదా ఆర్‌సిలకు సంబంధించిన పరీక్షలను క్లియర్ చేసిన వాళ్లు.. దరఖాస్తులను సమర్పించి నెలలు గడిచినా ఇంకా తమకు అందలేదని వాపోతున్నారు.

డి.సుధాకర్ అనే వాహనదారుడు మాట్లాడుతూ.. తాను నెల రోజుల క్రితమే డిఎల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని, ఆరు వారాల క్రితమే కొత్త బైక్ కొనుగోలు చేశానని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. కానీ, ఇప్పటి వరకు అతనికి పోస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, RC ప్రింటెడ్ స్మార్ట్ కార్డ్ రాలేదు. ఆయన ఆర్‌టీఏ కార్యాలయాన్ని సందర్శించగా.. స్మార్ట్‌కార్డు ప్రింటింగ్‌ మిషన్‌ సమస్య ఉందని కొందరు అధికారులు.. స్మార్ట్‌కార్డుల కొరత ఉందని మరికొందరు చెబుతున్నారు. "నాకు కార్డులు ఎప్పుడు లభిస్తాయో నాకు తెలియదు," అన్నారాయన.

ఆర్టీఏలు స్మార్ట్ కార్డుల కొరతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, RTAలు స్మార్ట్ కార్డ్‌ల కొరతను ఎదుర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత ఉంది. ఈ సమస్య త్వరలో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ ఫోన్‌లలో తమ డిఎల్, ఆర్‌సి వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకొని కొత్త కార్డులు జారీ చేసే వరకు వాటిని తమతో తీసుకెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు :

-స్మార్ట్ కార్డ్ కోసం వాహనదారుడు రవాణా శాఖకు రూ.200 చెల్లించాలి.

-ఆర్టీఏ వైజాగ్ ప్రతిరోజూ సగటున 100 కొత్త మరియు 100 రెనివల్ కార్డులను జారీ చేస్తుంది.

-స్మార్ట్ కార్డుల కొరత కారణంగా ప్లాస్టిక్ కార్డుల జారీని రవాణా శాఖ పరిశీలిస్తోంది.

-ప్రభుత్వం వాహనదారులు తమ వాహనాల డిజిటల్ రికార్డులు, డీఎల్‌లను తీసుకెళ్లేందుకు అనుమతించింది.

-వైజాగ్‌లో సగటున 50,000 కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయబడ్డాయి.. వారిలో 40 శాతానికి పైగా మహిళలు ఉన్నారు.

-ఏపీలో 30 శాతానికి పైగా కొత్త వాహనాలు మహిళల పేర్లతో రిజిస్టర్ అయ్యాయి.






























Next Story