అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Six Persons Dead In Road Accident. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  22 Nov 2022 6:25 PM IST
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. చింతూరు మండ‌లం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై జ‌రిగిన ప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు. మినీ వ్యాన్ ను లారీ ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ప్ర‌మాదంపై ఆరాతీశారు. వెంట‌నే గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతులను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story