సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు

Sirivennella's family members who met CM Jagan. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం దిగ్గజ సినీ గేయ రచయిత

By Medi Samrat  Published on  25 Jan 2023 2:45 PM GMT
సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. త‌మ‌ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సిరివెన్నెల స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి. కుటుంబ సభ్యులతో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు సీఎం జగన్ సిరివెన్నెల‌ కుటుంబ స‌భ్యుల‌కు భరోసానిచ్చారు. సిరివెన్నెల సతీమణి ప‌ద్మావ‌తితో పాటు కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్ శాస్త్రి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు.


Next Story
Share it