సింహాచలం ప్రమాద ఘటన.. మృతుల‌ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

By Medi Samrat
Published on : 30 April 2025 8:38 AM IST

సింహాచలం ప్రమాద ఘటన.. మృతుల‌ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు.

గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

Next Story