చిలకలూరి పేటలో వైసీపీకి షాక్

ఎన్నికలకు ముందు చిలకలూరిపేటలోయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కు షాక్ తగిలింది.

By Medi Samrat
Published on : 29 March 2024 9:30 PM IST

చిలకలూరి పేటలో వైసీపీకి షాక్

ఎన్నికలకు ముందు చిలకలూరిపేటలోయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కు షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లోకి భారీగా వైసీపీ నేతలు చేరుతున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ సమక్షంలో వైసీపీ మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు టీడీపీలో చేరారు. రాజేష్ నాయుడుతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్, 10 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి మారారు.

చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ రాజేశ్ నాయుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోల్డ్ శ్రీను టీడీపీలో చేరారు. వీరితో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచ్ లు టీడీపీ యువనేత నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి లోకేశ్ ఆహ్వానించారు. రాజేశ్ నాయుడు మాట్లాడుతూ మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చి మోసపోయానని సంచలన ఆరోపణలు చేశారు.

Next Story