వైసీపీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 27 Jan 2024 10:45 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ లో వైఎస్సార్ లేరని.. ఇప్పుడు ఆ పార్టీలో YSR అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి (సజ్జల) అని అన్నారు. వైసీపీ అంటే జగన్ పార్టీ అని.. జగన్ కోసం తాను కుటుంబాన్ని, పిల్లలను వదులుకుని 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని అన్నారు. అన్నిటికీ సిద్ధమయ్యే తాను వచ్చానని చెప్పారు. గత ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు మద్య నిషేధం చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ తనకే ఓటు వేయాలని మహిళలను వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
ఇక ప్రకాశం జిల్లా మద్దిపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి రూ.750 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మిస్తే.. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ సర్కార్ ఏడాదికి రూ. కోటి కూడా వ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రాజెక్టుకు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని చెప్పారు. దాన్ని చూస్తూ మీరే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు.